పీర్జాదిగూడ, జూలై 29 : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ 8వ డివిజన్ ఎస్.ఎన్ కాలనీకి చెందిన బేతి భాస్కర్‌రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.40వేల చెక్కు మంజూరైంది.
ఈ చెక్కును మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు మేయర్, స్థానిక నాయకులు రఘుపతిరెడ్డితో కలిసి లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కీసర, జూలై 29: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నారాయణ తెలిపారు. అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నిమ్మకాయల శ్రీనివాస్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.22,500 చెక్కును గ్రామ ఉప సర్పంచ్ మహేశ్‌తో కలిసి లబ్ధిదారుడికి శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ సభ్యులు లింగేశ్వర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జహంగీర్బాబు, నాయకులు శ్రీశైలం, బాల్‌రాజ్, బాలకుమార్, నరేశ్, ప్రశాంత్ పాల్గొన్నారు.
శామీర్‌పేట, జూలై 29 : ముఖ్యమంత్రి సహాయనిధి పేద కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నదని సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామానికి చెందిన పలువురికి సీఎం సహాయనిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి.
నర్సింలుకు రూ.లక్ష, నాగరాజుకు రూ.59 వేలు, రేణుకకు రూ.25వేలు, జే.నరేశ్‌కు రూ.29 వేలు, ఇరుగణి నరేశ్‌కు రూ. 35 వేల చెక్కులను శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి అనిల్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు ప్రవీణ్‌గౌడ్, వార్డు సభ్యులు, నాయకులు బాల్‌రెడ్డి, వీరస్వామి, బీరప్ప, నాగరాజు, సాయిబాబు, మహేశ్ , శివ, నర్సారెడ్డి, సుధాకర్, వీరేశ్, శ్రీకాంత్, నరేశ్ , జహంగీర్, ప్రకాశ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.