సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఆంగ్లంపై పట్టు సాధించేందుకు యువతకు 30రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ (ఆస్క్స్)-ఫూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫికల్ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్ (ప్యాక్పెట్) డైరెక్టర్ డాక్టర్ బాలబోయిన సుదర్శన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్-యాంటీ క్యాస్ట్ ఫిలాసఫీ అండ్ సోషియో పొలిటికల్ కాన్సెప్ట్’ అంశంపై నెల రోజుల శిక్షణతోపాటు భోజన వసతి కూడా ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న, పూర్తయిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆంగ్ల విద్య, ఆధునిక జ్ఞానం అనివార్యంగా మారిందని, పే బ్యాక్ టు సొసైటీ అనే ఆలోచనతో పేద విద్యార్థులకు ఉచిత శిక్షణను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఈనెల 22లోపు తమ దరఖాస్తును askes2022@ gmail.com కు పంపాలని, ఈ నెల 24, 25తేదీల్లో ఫోన్ ద్వారా, లేదా ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు. 26న సాయంత్రం ఎంపికైన జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. ఎంపికైన వారికి తెల్లాపూర్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నా రు. మరిన్ని వివరాలకు కోఆర్డినేటర్ మణికంట-94918 27637, 63093 16222, www.ask es.in లో సంప్రదించాలని సూచించారు.