జీడిమెట్ల, జూలై29: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా మారిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం చింతల్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన కల్యాణ లక్ష్మి షాదీముబారక్ పథకం కింద మంజూరైన రూ.1.66,19,256 చెక్కులను 166 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడాలేని విధంగా పేదల సంక్షేమానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోని ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు.
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించేందుకు సీఎం కేసీఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. శుక్రవారం చింతల్‌లోని పార్టీ కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు రూ.20 లక్షల 55 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, మాజీ కార్పొరేటర్లు కె.ఎం.గౌరీష్, బొడ్డు వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జయరామ్, మాజీ కౌన్సిలర్లు కిషన్‌రావు, రంగారావు, డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రుద్ర అశోక్, ఏర్వ శంకరయ్య, పుప్పాల భాస్కర్, పోలె శ్రీకాంత్, దేవరకొండ శ్రీనివాస్, నాయకులు సంపత్ మాధవరెడ్డి, కృష్ణగౌడ్, సయ్యద్ రషీద్, గుమ్మడి మధుసూదన్‌రాజు, కస్తూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ హెచ్ఏఎల్ కాలనీ ఫేజ్-2 సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కొన్నేళ్లుగా తమ నివాసాలకు అక్సుపెన్సీ సర్టిఫికేట్ లేకపోవడంతో టాక్స్, మంజీరా నీటి వసతులులేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధికారులతో మాట్లాడి అక్సూఫెన్సీ సర్టిఫికెట్లు ఇప్పించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. రాజశేఖర్, శ్రీకాంత్, రామకృష్ణ, సతీశ్, వెంకటరావు, గోపీ, రమేశ్, చంద్రశేఖర్, నవీన్, మాధవ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
డివిజన్ పరిధి గాంధీనగర్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే వివేకానంద్‌ను కలిసి తమ కాలనీలో సీసీ రోడ్లను పూర్తి చేయాలని, అదే విధంగా కమ్యూనిటీ హాలు పైఅంతస్తుతో పాటు మహిళా భవనం నిర్మాణ పనులు వేగవంతం చేయలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంక్షేమ సంఘం నాయకుడు జల్దా లక్ష్మినాథ్, వార్డు మెంబర్ అబ్దుల్ ఖాదర్ తదితరులు ఉన్నారు.