ఖైరతాబాద్, జూలై 29 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక వర్గానికే ప్రాధాన్యతనిస్తున్నాడని, అతడి కుల వివక్షతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ బీసీ నేత రామా గౌడ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాజీనామా పత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించిన తర్వాత వర్గ వివక్ష పెరిగిందన్నారు.
ఇటీవల జరిగిన ఓ సభలో సైతం తన సామాజికవర్గానికే మద్ధతుగా మాట్లాడటంతో పాటు పార్టీలోని కీలక పదవులను సైతం వారికే కేటాయిస్తున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి టీపీసీసీలో ఉన్నన్ని రోజులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎలాంటి న్యాయం జరుగదన్నారు. ఈ విషయాన్ని డీసీసీ అధ్యక్షుడు, పార్లమెంటరీ ఇన్చార్జి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. తనతో పాటు బీసీ, ఇతర వెనుకబడిన సామాజిక వర్గాలన్ని బయటకు వస్తున్నాయని తెలిపారు.
గోల్నాక, జూలై 29: అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ వేయించుకోవాలని గోల్నాక డివిజన్ జైస్వాల్గార్డెన్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతల శ్రీనివాస్‌ముదిరాజ్ కోరారు. శుక్రవారం జైస్వాల్గార్డెన్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ బూస్టర్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి బూస్టర్ డోస్ వేయించుకున్నారు.