మల్కాజిగిరి, జూలై 29 : వరద ముంపు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ ఆదర్శనగర్‌లో రూ.30 లక్షలతో ఆర్సీసీ పైపులైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలో డ్రైనేజీ, రోడ్లు, నీటి సౌకర్యం, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు.
వరద ముంపు నివారణ కోసం బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని అన్నారు. వానల వల్ల రోడ్లు పాడయ్యాయని, వెంటనే వాటికి మరమ్మతులు చేస్తున్నామన్నారు. అన్ని కాలనీల్లో అధికారులతో సర్వే చేయించి అవసరమైన కాలనీల్లో సీసీ రోడ్డు వేస్తామన్నారు.
హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ శ్రీకాంత్, కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్‌కుమార్, మీడియా ఇన్చార్జి గుండా నిరంజన్, సత్యమూర్తి, శ్రీనివాస్, బాబు, సత్యనారాయణ, ఉపేందర్, మోహన్‌రెడ్డి, నయీమ్‌ఖాన్, ఉమాపతి, కవిత, వైశాలి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
బస్తీల్లో కమ్యూనిటీ హాల్‌లను నిర్మిస్తామని ఎమ్మెల్యే హన్మంతరావు అన్నారు. శుక్రవారం ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ అనంతసరస్వతినగర్లో రూ.10లక్షలతో నిర్మించిన కమ్యూనిటీహాల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్‌కుమార్, మీడియా ఇన్చార్జి గుండా నిరంజన్, పిట్టల శ్రీనివాస్, సత్యమూర్తి, సత్యనారాయణ, ఉపేందర్, మోహన్‌రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
అల్వాల్, జూలై 29: దళితు అభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆయన అల్వాల్‌లో దళితబంధు కింద మంజూరైన లబ్ధిదారుడి బట్టల దుకాణాన్ని స్థానిక కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రారంభించారు. మచ్చబొల్లారం కార్పొరేటర్ జితేంద్రనాథ్, అనిల్ కిశోర్ గౌడ్, నాగేశ్వరరావు, ప్రభాకర్, రాజేశ్ ఖన్నా, బబిత, కవిత పాల్గొన్నారు.
గౌతంనగర్, జూలై 29 : ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు వైద్యం అందించడం సంతోషకరమని ఎమ్మెల్యే హన్మంతరావు అన్నారు. గౌతంనగర్ డివిజన్ పరిధి ఇందిరా నెహ్రూనగర్‌లో హ్యాండ్ ఆఫ్ హోఫ్, హిల్ చర్చి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే హన్మంతరావు కార్పొరేటర్ మేకల సునీతారాముతో కలిసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు, పాస్టర్ బక్క ఏలియా, రాముయాదవ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.