కవాడిగూడ, జూలై 29: సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ మేరకు శుక్రవారం భోలక్‌పూర్ బడీమసీదు నుంచి ముషీరాబాద్ మెట్రోస్టేషన్ వరకు రూ.21 లక్షల వ్యయంతో వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ గౌసొద్దీన్ తహ, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, ఏఈ తిరుపతి, వర్క్ ఇన్స్పెక్టర్ దాసునాయక్లతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. భోలక్‌పూర్‌లో కోట్లాది రూపాయలతో తాగునీటి, డ్రైనేజీ పైపులైన్, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకులు ముఠా జయసిం హ, వై. శ్రీనివాస్ రావు, నాయకుడు ముచ్చకుర్తి ప్రభాకర్, ఎ. శంకర్‌గౌడ్, షరీఫొద్దీన్, కండ్లపల్లి శ్రావణ్‌కుమార్, బైరు గోవింద్రాజ్ పాల్గొన్నారు.
చిక్కడపల్లి : పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం ఆర్ఎఫ్ వరం లాంటిదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం గాంధీనగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలోని మొత్తం 24 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. లబ్ధిదారులు సునీతకు రూ. 60,000, సంతోష్ కుమార్‌కు రూ.14,500, పి. ఉమకు రూ.20,000, నవనీతకు రూ.18000, దేవదాస్‌కు రూ. 24000, పవన్ కుమార్‌కు రూ. 36,000, అబ్దుల్‌కు రూ. 24,000, మౌనికకు రూ. 23,000, గణేశ్‌కు రూ. 32,000, మొయునుద్దీన్కు రూ. 31,000, యాదమ్మకు రూ.19,500, ఎండీ షానూన్కు రూ. 13,000, రఘు కుమార్‌కు రూ.24,000, సక్కుబాయికి రూ.11000, శ్రీనివాస్‌కు. 24,000, సంతోష్‌కు రూ. 20,000, మున్నీర్కు రూ. 48,000, జె.శ్రీనివాస్‌కు రూ. 60,000, సత్యకుమార్‌కు రూ. 16,000, మోహన్‌రెడ్డికి రూ.36,000, అనిల్‌కు. రూ.116,000 లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, గాంధీనగర్, రాంనగర్, కవాడిగూడ, ముషీరాబాద్, అడిక్‌మెట్ డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎం. రాకేశ్, రావుల పాటి మోజస్, శ్యామ్యాదవ్, నర్సింగ్‌ప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ముఠా నరేశ్, ముచ్చకుర్తి ప్రభాకర్, మన్నే దామోదర్‌రెడ్డి, గుడు జగదీశ్‌బాబు, మారిశెట్టి నర్సింగ్‌రావు, ఎర్రం శ్రీనివాస్‌గుప్తా, ఆకుల శ్రీనివాస్, గడ్డమీది శ్రీనివాస్, రవిశంకర్‌గుప్తా, పున్న సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్, ముఠా శివసింహ, పరశురాం తదితరులు పాల్గొన్నారు.