గోల్నాక, జూలై 29 : అంబర్‌పేట నియోజకవర్గంలో వచ్చే వానాకాలం నాటికి వరద ముంపు సమస్యకు మోక్షం కల్పిస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి భారీ నిధులతో నాలాల విస్తరణ పనులు చేపడుతున్నామని అన్నారు. శుక్రవారం అంబర్‌పేట డివిజన్ ప్రేమ్‌నగర్‌లో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి ప్రేమ్‌నగర్ నుంచి ఎస్టీపీ వరకు రూ.2.50కోట్లతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడు తూ.. బాగ్‌అంబర్‌పేట ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చే వరద నీటితో లోతట్టు ప్రాంతమైన ప్రేమ్‌నగర్ జలమయమై స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇది దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో ఎంత ఉధృతి వచ్చినా వరదనీరు సజావుగా వెళ్లేందుకు ప్రేమ్‌నగర్ నుంచి ఎస్టీపీ వరకు నాలా విస్తరణ పనులు ప్రారంభించామని తెలిపారు.
మూడు నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ పనులకు స్థానికులు సహకరించాలని కోరారు. రెండేండ్ల క్రితం లోతట్టు ప్రాంతాల వాసులు ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నాలాలా పూడిక తీత పనులతో పాటు వరదనీటి పైపులైన్ల ప్రక్షాళన పనులు చేపడుతున్నామని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట వర్షపాతం నమోదవుతున్నా పెద్దగా ఇబ్బందులు రాలేదని అన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాగం నిరంతరం అప్రమత్తంగా ఉందని చె ప్పారు. ఎక్క డా వరద నీరు నిలిచి పోకుండా చర్యలు చే పడుతున్నామని తెలిపారు. వర్షాకాలంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ ఎస్ఎన్డీపీ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నాలాల ప్రక్షాళనకు సమగ్ర ప్రణాళిక రూ పొందించారని అన్నారు.
ఇందులో భాగంగా బాగ్‌అంబర్‌పేట మోహిన్ చెరువు నాలా నుంచి అంబర్‌పేట ప్రేమ్‌నగర్ నాలా మీదుగా సీవరేజీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు రూ.22 కోట్ల నిధులతో నాలా ప్రక్షాళన పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు.
అనతంరం మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద తాజా పరిస్థితిని పరిశీలించారు. వరద ఉధృతి తగ్గడంతో పేరుకు పోయిన బురద, వ్యర్థాలను శుభ్రం చేయించి రాకపోకలను పునరుద్ధరించారు. అంబర్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్తో, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అంబర్‌పేట : బాగ్‌అంబర్‌పేట డివిజన్ ఛే నంబర్లో రామాలయం కమాన్ పునర్నిర్మాణ పనులకు కా ర్పొరేటర్ బి. పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రావణమాసం మొదటి రోజు ఛే నంబర్ ఫ్లైఓవర్ నిర్మాణ రోడ్డు వెడల్పులో వెనుకకు జరుపుతున్న రామాలయం కమాన్ పునర్నిర్మాణ భూమి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. స్థానికులు ఎస్. అనిల్‌కుమార్, డాక్ట ర్ ప్రేమ్, అడ్వకేట్ ప్రభులింగం, గణేశ్, మల్లేశ్, రమేశ్, కిరణ్, ప్రవీణ్, చారి, కనకయ్య, శేఖర్ పాల్గొన్నారు.
కాచిగూడ : కాచిగూడ చప్పల్‌బజార్‌లో శుక్రవారం సాయిబాబా ఆధ్వర్యంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ కన్నె ఉమారమేశ్యాదవ్ హాజరై పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు భీష్మాదేవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డా. శిరీషా ఓంప్రకాశ్యాదవ్, దిడ్డి రాంబాబు, సునీల్ బిడ్లానీ, నాగేందర్ బాబ్జీ, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.