సుల్తాన్‌బజార్,జూలై 29 : ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం రెండో స్థానంలో ఉందని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. శుక్రవారం నిజాం కళాశాల మైదానంలో కళాశాల బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రబంధోత్సవ్-2022 కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ భీమా, ఓయూ బిజినెస్ మేనే జ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాములు,నిజాం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ రంజని తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కంటే ప్రస్తుతం ఐటీ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. నిజాం కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలన్నారు.
కళాశాలలో చదివిన విద్యార్థులు రాష్ట్ర ముఖ్య మంత్రు లు, సినీ నటులు, రాజకీయ ప్రముఖులు,వ్యాపార వేత్తలుగా ఎదిగారన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్ఫ్రాస్టక్చర్ స్పెషల్ అధికారి సాంబ శివుడు,పీ ఆర్వో డాక్టర్ కసప నరేందర్ పాల్గొ న్నారు.