Osmania Hospital Victim | మీరు ఇల్లు ఖాళీ చేయాలి.. లేదంటే బుల్డోజర్ తీసుకువచ్చి మీ ఇండ్లు కూల్చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ బెదింపులకు పాల్పడుతుందని బేగంబజార్, బాలయ్య వాడ బస్తీలో నూతన ఉస్మానియా ఆసుపత్రి బాధితులు వాపోతున్నారు.
బాలయ్య వాడ బస్తీలో ఓ బాధిత మహిళ మాట్లాడుతూ.. సంవత్సరాలుగా మా మామలు, తండ్రులు, తండ్రుల నుంచి ఇక్కడుంటున్నా. మేం వంద సంవత్సరాల నుంచి ఇక్కడున్నోళం. అట్లాంటిది మీరు ఎలాంటి సమాచారం లేకుండా ఇండ్లన్నీ తీసేసుకుంటం. జీహెచ్ఎంసీ వాళ్లు వస్తున్నరు.. పోతున్నరు.. నోటీసులు పెడ్తున్నరు.. మీరు ఇల్లు ఖాళీ చేసేయాలే.. మాకు ఆర్డర్ వచ్చింది.. మీరు వినకపోతే బుల్డోజర్ తీసుకొస్తం. కూలగొట్టేస్తాం. మీరు వింటరా.. లేదా..? మీ ఇంటి కాగితాలు మాకు ఇచ్చేసేయండని అంటున్నరు.
కాంగ్రెస్ సర్కార్ పేదోళ్ల ప్రభుత్వం అంటూనే పేదోళ్ల పొట్టనే కొడ్తున్నరు.. వాళ్లకు ఉన్నోడు కనిపిస్తలేదు. పేదోళ్ల ఇళ్లు గుంజుకుంటున్నడు.. పేదోళ్లను రోడ్డుమీదికి తెచ్చి వేస్తున్నరు. పేదోళ్లకేం సాయం చేస్తలేడు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు.. మనవడితో ఫుట్ బాల్ ఆడుడు, గ్లోబల్ సమ్మిట్ పెట్టి వందల కోట్లు నాశనం చేసాడు. ఆయన వచ్చినప్పటి నుంచి నష్టం తప్ప ఏం లాభం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి అనుడే తప్ప.. చేసింది ఏమీ కనిపించడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు సూపర్ ఉండే.. రేవంత్ రెడ్డి వచ్చి హైదరాబాద్‌ను నాశనం చేశాడని మండిపడ్డది. రేవంత్ రెడ్డి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లతో గెలిచాడు.. ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా డబ్బులు ఇచ్చి కొన్నాడని ఆరోపించింది.
కేసీఆర్ పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టలేదు. కేసీఆర్ నాలా ప్రక్షాళన చేసిండు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాలా ప్రక్షాళనకు కేసీఆర్ మంచి ప్లాన్ ఇచ్చిండు. ప్లాన్ కూడా తయారు చేసిండు. ఆయన ఉంటే మొదలు కూడా పెడుతుండే అని చెప్పుకొచ్చింది.
మీరు ఇల్లు ఖాళీ చేయాలి.. లేదంటే బుల్డోజర్ తీసుకువచ్చి మీ ఇండ్లు కూల్చేస్తామని బెదిరిస్తున్నారు
పేదోళ్ల ప్రభుత్వం అంటూనే.. పేదోళ్ల పొట్టలు కొడుతున్నాడు
మనవడితో ఫుట్ బాల్ ఆడుడు, గ్లోబల్ సమ్మిట్ పెట్టి వందల కోట్లు నాశనం చేసాడు
రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి అనుడే తప్ప..… https://t.co/VtvrMKhUvA pic.twitter.com/evNY03ljnT
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2026
Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ షూటింగ్ వాహనంలో AK-47లు.. తనిఖీల్లో అధికారులకు షాక్!
Vijayawada | విజయవాడలో టెర్రర్ కలకలం.. ముగ్గురు యువకులను ఉగ్రవాదంవైపు నెట్టిన హైదరాబాద్ యువతి!
వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పంటించిన దుండగుడు.. పలువురికి తీవ్ర గాయాలు