Sajjanar | చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్
Sajjanar | చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. విక్టోరియా గ్రౌండ్లో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని శనివారం సాయంత్రం సజ్జనార్ పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
Sajjanar | చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. విక్టోరియా గ్రౌండ్లో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని శనివారం సాయంత్రం సజ్జనార్ పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
కాలాపత్తర్ రౌడీషీటర్ ఉమర్ సెల్‌ఫోన్ చోరీకి యత్నించాడని సజ్జనార్ తెలిపారు. పట్టుకునే సమయంలో పోలీసులపై దాడికి యత్నించాడని పేర్కొన్నారు. పరిస్థితి చేయి జారకుండా ఉండాలని డీసీపీ చైతన్య కాల్పులు జరిపారని తెలిపారు. ఈ ఘటనలో ఒక దొంగ పరారయ్యాడని.. మరో దొంగ ఉమర్ పట్టుబడ్డాడని చెప్పారు. ఉమర్‌పై గతంలో 25 కేసులు ఉన్నాయని తెలిపారు. అతనిపై రౌడీషీట్ కూడా ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీసులకు ఉమర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చెప్పారు.
ఉమర్ ఎదురుతిరగడంతోనే కాల్పు జరిపామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. కాల్పుల్లో ఉమర్‌కు మూడు చోట్ల గాయాలయ్యాయని తెలిపారు. ఉమర్ దాడిలో గన్‌మెన్‌కు కూడా గాయాలయ్యాయని పేర్కొన్నారు. డీసీపీ చైతన్య, ఇతర సిబ్బంది బాగానే ఉన్నారని చెప్పారు. నిందితుడు ఉమర్‌ను బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇక పరారీలో ఉన్న మరో నేరస్తుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.
అసలేం జరిగిందంటే..?
ఇవాళ హైదరాబాద్ సీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం చైతన్య తిరిగి తన కార్యాలయానికి వస్తున్నారు. చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్దకు రాగానే ఓ ఇద్దరు దొంగలు సెల్ఫోన్లను చోరీ చేసి పారిపోతున్నారు. ఆ సెల్‌ఫోన్ స్నాచర్స్‌ను గమనించిన డీసీపీ చైతన్య తన గన్‌మెన్‌ను అప్రమత్తం చేశారు. డీసీపీ, గన్‌మెన్ కలిసి ఆ ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో దొంగలు.. డీసీపీపై కత్తితో దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దొంగలను గన్‌మెన్ అడ్డుకునేందుకు యత్నించాడు. కానీ తోపులాటలో గన్‌మెన్ కింద పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన డీసీపీ చైతన్య.. గన్‌మెన్ వద్ద ఉన్న వెపన్‌ను తీసుకుని దొంగలపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇద్దరిలో ఒక దొంగకు తీవ్ర గాయాలయ్యాయి. దొంగకు ఛాతి, వెన్ను భాగంలో గాయాలు కావడంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

