హైదరాబాద్ : క్యారీ బ్యాగ్‌కు డబ్బులు వసూలు చేసిన ఓ డీమార్ట్‌కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ షాకిచ్చింది. హైదర్‌గూడ డీమార్ట్‌లో ఇటీవల ఓ కస్టమర్ సరుకులు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత క్యారీ బ్యాగ్‌కు కూడా డీమార్ట్ సిబ్బంది రూ. 3.50 వసూలు చేశారు. క్యారీ బ్యాగ్‌కు డబ్బులు వసూలు చేయడాన్ని సదరు కస్టమర్ తప్పుబట్టారు.
దీంతో ఆ వ్యక్తి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్.. డీమార్ట్‌కు షాకిచ్చింది. సరుకులు కొనుగోలు చేస్తే ఉచితంగా క్యారీ బ్యాగ్ ఇవ్వాల్సిందే.. లేదంటే చర్యలు తప్పవని వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. క్యారీ బ్యాగ్‌పై షాప్ లోగో ఉన్నా.. లేకున్నా ఇప్పటి నుంచి వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయొద్దు అని సూచించింది.
వినియోగదారుడి నుంచి క్యారీ బ్యాగ్ కోసం వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతో పాటు పరిహారంగా న్యాయ సేవా కేంద్రానికి రూ.1000, వినియోగదారునికి మరో రూ. 1000 చెల్లించాలని హైదర్‌గూడ డీమార్ట్‌ను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఇప్పటి నుంచి ఏ సూపర్ మార్కెట్ అయినా, షాపింగ్ మాలైనా.. క్యారీ బ్యాగ్స్‌కు డబ్బులు వసూలు చేయద్దు అని వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.