Collector Anudeep | బడికి డుమ్మా కొడితే.. పేరు తొలగిస్తాం: కలెక్టర్ అనుదీప్
బడికి డుమ్మా కొడితే ఇక పేరు తొలగించడమే. విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు సక్రమంగా వచ్చేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
- విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చర్యలు
- హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
Collector Anudeep | సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : బడికి డుమ్మా కొడితే ఇక పేరు తొలగించడమే. విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు సక్రమంగా వచ్చేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
ప్రతి పాఠశాలపై రిపోర్ట్ తీసుకుంటానని తెలిపారు. నెలకంటే ఎక్కువ రోజులు రాని విద్యార్థుల పేర్లు ఎఫ్ఆర్సీ నుంచి తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా, ప్రజావాణిలో భాగంగా 147 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్‌బాడీస్ కదిరవన్, ఆర్డీఓలు మహిపాల్, దశరథ్ సింగ్, జిల్లా అధికారులు ఆశన్న, పెరికె యాదయ్య, జిల్లా ఇంటర్ విద్యాధికారి వడ్డెన్న, కోటాజి, రాజేందర్ పాల్గొన్నారు.
వైద్య సేవల్లో నిర్లక్ష్యం.! ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ
వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను హెచ్చరించారు. సమయానికి విధులకు హాజరు కాకుండా రోగులను ఇబ్బందులకు గురి చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బంజారాహిల్స్‌లోని విమలానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్‌ను పరిశీలించారు. సిబ్బంది వివరాలు ఆరా తీసి, ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బంది విజయలక్ష్మి, నాగలక్ష్మి, పార్వతిలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలిచ్చారు. కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగకార్తీక్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

