షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
భగవంతుడి దర్శనం కోసం గుడికి వెళ్లి వచ్చే సరికి ప్రమాదవశాత్తు ఇంట్లో షాట్ సర్క్యూట్ కావడంతో ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతై ఓ కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటన జవహర్‌నగర్ పో లీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా చేర్యాల్ మండలం నాగపూరికి చెందిన శ్రీకాంత్ 20ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి జవహర్‌నగర్‌లోని కార్మికనగర్‌లో భార్య దివ్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు.
జవహర్‌నగర్, మే 16: భగవంతుడి దర్శనం కోసం గుడికి వెళ్లి వచ్చే సరికి ప్రమాదవశాత్తు ఇంట్లో షాట్ సర్క్యూట్ కావడంతో ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతై ఓ కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటన జవహర్‌నగర్ పో లీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా చేర్యాల్ మండలం నాగపూరికి చెందిన శ్రీకాంత్ 20ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి జవహర్‌నగర్‌లోని కార్మికనగర్‌లో భార్య దివ్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. శ్రీకాంత్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం అమవాస్య కావడంతో ఉదయమే ఇంట్లో పూజ చేసుకుని… చీర్యాల్‌లోని దేవాలయానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు.
ఈ క్రమంలోనే ఇంట్లోంచి పొ గలు వస్తున్నాయని స్థానికులు శ్రీకాంత్‌కు తెలియజేయగా, వెంటనే ఇంటికి వచ్చి చూసేలోపు పూర్తిగా కాలికిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీ సుకొచ్చారు. ఇంట్లో దాచుకున్న రూ.4 లక్షలు, 3తులాల బంగారు ఆభరణా లు మంటల్లో కాలిపోవడంతో కన్నీటి పర్యాంతమయ్యారు. సొంత ఊర్లో ఇల్లు కట్టుకోవాలని దాచుకున్న రూ. 4లక్షలు కాలిపోవడంతో కుటుంబసభ్యుల రోధనలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సుమారు 12లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

