
సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఈనెల 5వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతా ల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉన్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణాఫేజ్ రింగ్-2 రింగ్ మెయిన్ -2 నాగోల్ జంక్షన్ వద్ద మారుతీ సుజుకీ షోరూం నుంచి దుర్గావైన్స్ వరకు జలమండలి 1600 ఎంఎం డయా ఎంఎస్ జంక్షన్ పనులను చేపట్టింది. ఈ క్రమంలోనే బాలాపూర్, మైసారం, బార్కాస్ రిజర్వాయర్ ప్రాంతాలు, మేకలమండి, బోలక్పూర్ రిజర్వాయర్ ప్రాంతాలు, తార్నాక, లాలాపేట్, బౌద్ధ్దనగర్, మారేడుపల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ, రిజర్వాయర్ ప్రాంతాలు, హస్మత్‌పేట, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్ రిజర్వాయర్ ప్రాంతాలు, వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతీనగర్ రిజర్వాయర్ ప్రాంతాలు, మహీంద్రాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచా రం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగడ్డ రిజర్వాయర్ ప్రాంతాలు, బోడుప్పల్‌లోని కొన్ని ప్రాంతాలు, మీర్‌పేట, బడంగ్‌పేట రిజర్వాయర్ రిజర్వాయర్ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి ఎండీ సూచించారు.