గాంధీలో కోవిడ్ సహాయక కేంద్రం

- బాధితుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఏర్పాటు
- ఎప్పటికప్పుడు పడకల సమాచారమూ వెల్లడి
- ప్రారంభించిన సీపీ అంజనీకుమార్
- త్వరలో 24 గంటలు పనిచేసే ఫోన్ నంబర్లు : డాక్టర్ రాజారావు
సిటీబ్యూరో, మే 6(నమస్తే తెలంగాణ)/బన్సీలాల్‌పేట : కరోనాతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమవారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు కొవిడ్ సహాయక కేంద్రం ఏర్పాటైంది. గురువారం దీన్ని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో కలిసి నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కొవిడ్‌తో బాధపడుతున్న వారి కుటుంబసభ్యులకు లోపలికి అనుమతి లేదని, ఈ హెల్ప్ సెంటర్ నుంచి లోపల వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చన్నారు.
అనవసరంగా కుటుంబసభ్యులు, బంధువులు దవాఖానకు రావొద్దని, గతంలో చికిత్స పొందుతున్న వారికోసం వచ్చిన వారు చాలామంది కొవిడ్ బారిన పడ్డారని గుర్తుచేశారు. వైద్యులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో హెల్ప్ సెంటర్ పనిచేస్తుందని, దీంతోపాటు దవాఖానలో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయనే సమాచారం కూడా తెలుసుకోవచ్చని, దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను తయారు చేశామన్నారు. ఇలాంటి సహాయక కేంద్రాలను ఇతర పెద్ద దవాఖానల్లోనూ ప్రారంభిస్తామన్నారు. కరోనా రోగులకు వైద్యసేవలు అందిస్తున్న వైద్య బృందానికి నగర పోలీసుల తరపున సెల్యూట్ చేస్తున్నామని సీపీ అన్నారు.
చాలామంది పోలీసులు కూడా కరోనా బారినపడ్డారని, అందులో కొందరు కోలుకోగా, మరికొందరు చికిత్స పొందుతున్నారని చెప్పారు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మాట్లాడుతూ దవాఖానలో రోగి రాగానే ట్రైయాజ్ వద్ద వైద్యులు పరిశీలించి, ఎక్కడ బెడ్లు ఖాళీ ఉన్నాయో అక్కడికి తరలిస్తారని, ఇందుకోసం గతేడాదిగా బెడ్ మేనేజ్మెంట్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నామని అన్నారు. దీన్ని కొవిడ్ హెల్ప్‌డెస్క్‌కి అనుసంధానం చేస్తామని తెలిపారు. త్వరలో 24 గంటలు పనిచేసే రెండు టెలిఫోన్ నెంబర్లను ప్రకటిస్తామని, వాటిద్వారా కూడా రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు సీపీ డీఎస్ చౌహాన్, నార్త్‌జోన్ డీసీపీ కమలేశ్వర్ సింగన్వర్, గాంధీ దవాఖాన డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహారావు, ఆర్ఎంవోలు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ ప్రభుకిరణ్, నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
గచ్చిబౌలి టిమ్స్‌లోనూ హెల్ప్ డెస్క్
- కొండాపూర్, మే 6 : కొవిడ్ బాధితుల సమాచారాన్ని వారి కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు అందించేందుకు గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో గురువారం పోలీసు సహాయక కేంద్రం (హెల్స్ డెస్క్) ప్రారంభమైంది.
- దీన్ని టిమ్స్ డైరెక్టర్ విమల థామస్‌తో కలిసి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
- కరోనా సోకిన వారి కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రి లోపలికి అనుమతించడం లేదని టిమ్స్ డైరెక్టర్ విమల థామస్ పేర్కొన్నారు.
- దవాఖానలో చికిత్స పొందుతున్న వారి వివరాలను ఈ డెస్క్‌లో తెలియజేస్తారని తెలిపారు.
- వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ సమన్వయంతో చికిత్స పొందుతున్న వారి వివరాలను తెలియజేసేందుకు ఈ కేంద్రంలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు.
- ఈ కార్యక్రమంలో టిమ్స్ ఆర్ఎంవోలు డాక్టర్ శశిధర్, నితిన్, మాదాపూర్ ఏసీపీ రఘునందన్, గచ్చిబౌలి సీఐ సురేష్, ఎస్ఐ నవీన్‌రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

