అబిడ్స్, సెప్టెంబర్ 3: ఎడతెరిపి లేకుండా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లు, చెరువులు, కుంటలు నిండి పోయాయి. దీంతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 8090199299ను ఏర్పాటు చేశారు. శాంతినగర్‌లోని మత్స్య భవన్లో మత్స్య శాఖ కమిషనర్ ప్రియాంక ఆల, ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల సహాయం కోసం ఈ హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశామన్నారు. మత్స్యకారులకు 24 గంటల పాటు ఫోన్ ద్వారా సేవలందించేందుకు హెల్ప్ లైన్ నంబర్ 8090199299 అందుబాటులో ఉంటుందని తెలిపారు. వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.