కింగ్‌కోఠి దవాఖానలో హెల్ప్‌డెస్క్ 94906 16536

కింగ్‌కోఠి ప్రభుత్వ దవాఖానలో సేవలు, సౌకర్యాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలిపేందుకు శనివారం హెల్ప్‌డెస్క్ ప్రారంభమైంది. దీని ద్వారా దవాఖానకు వచ్చే వారికి బెడ్స్, వెంటిలేటర్స్, ఐసీయూ బెడ్స్ వంటి వివరాలను తెలియజేస్తున్నారు. జీహెచ్ఎంసీతో సమన్వయపర్చుకుని పార్థివదేహాలను తరలిస్తున్నారు. 9490616536 కు ఫోన్ చేస్తే..ప్రతిరోజూ డిశ్చార్జి అయిన రోగుల వివరాలతో పాటు దవాఖానకు దగ్గరలో ఉన్న డయగ్నాస్టిక్ కేంద్రాల వివరాలను తెలియపరుస్తున్నారు.
వ్యాక్సినేషన్, ఓపీ, డయాలసిస్ కోసం వచ్చే వారికి ఈ హెల్ప్ డెస్క్ సహాయపడుతుంది. త్వరలోనే ఈ హెల్ప్ డెస్క్ ద్వారా ఉచిత ఫోన్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఐఏఎస్ స్పెషల్ సెక్రటరీ టీఆర్ అండ్ బీ స్పెషల్ ఆఫీసర్ విజీంద్రబోయి, కింగ్ కోఠి ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డా.రాజేంద్రనాథ్‌లు ఈ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్మాణ్ ఓఆర్జీ సంస్థ 20 ఆక్సిజన్ కాన్సిడేటర్ పరికరాలను కింగ్‌కోఠి దవాఖానకు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దవాఖాన అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ, నోడల్ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్, ఆర్ఎంవో డాక్టర్ విరజ, స్టోర్ ఇంచార్జి షాహిదా, నారాయణగూడ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Help desk
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

