Khairatabad Ganesh | 75 అడుగుల పొడవు… సప్తముఖుడి శోభాయాత్రకు భారీ వాహనం
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్రకు అధునాతన ట్రయిలర్‌ను వినియోగిస్తున్నారు. వోల్వో ఇంజన్ కలిగిన బీఎస్ 6 వాహనంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 75 అడుగుల పొడవు, 11అడుగుల వెడల్పు కలిగిన ఈ వాహనాన్ని 26 టైర్లు ఉంటాయి. వంద టన్నుల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉంటుంది.
Khairatabad Ganesh | ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్రకు అధునాతన ట్రయిలర్‌ను వినియోగిస్తున్నారు. వోల్వో ఇంజన్ కలిగిన బీఎస్ 6 వాహనంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 75 అడుగుల పొడవు, 11అడుగుల వెడల్పు కలిగిన ఈ వాహనాన్ని 26 టైర్లు ఉంటాయి. వంద టన్నుల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉంటుంది.
మహాగణపతి విగ్రహం సుమారు 70 టన్నుల బరువు ఉంటుందని శిల్పి రాజేంద్రన్ చెబుతున్నారు. పదకొండు సంవత్సరాలుగా స్వామి వారికి రథసారథిగా వ్యవహరిస్తున్న భాస్కర్‌రెడ్డి ఈ ఏడాది కూడా వాహనాన్ని నడుపుతారు. ఈ ట్రాయిలర్తో రోడ్డు ఎలా ఉన్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా గణపతి విగ్రహాన్ని తరలించవచ్చని చెబుతున్నారు. సోమవారం సాయంత్రం నుంచే గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్డు తొలగిస్తారు. రాత్రి 12గంటలకు కలశ పూజ నిర్వహించి విగ్రహానికి ఉద్వాసన పలికి శోభాయాత్రకు సిద్ధం చేస్తారు.
మధ్యాహ్నం 1.30కల్లా నిమజ్జనం
నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. నాంపల్లి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివారం రాత్రి ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో సీపీ మాట్లాడుతూ ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం.
మధ్యాహ్నం 1.30 కల్లా పూర్తవుతుందన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, సమితి కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్, సైబరాబాద్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

