Hyderabad | హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్యాట్నీ ఫ్లై ఓవర్‌పై ఆర్మీ ట్రక్కు ఆకస్మాత్తుగా ఆగిపోయింది. ఆర్మీ ట్రక్కులో సాంకేతిలోపం తలెత్తడంతో ఫ్లై ఓవర్‌పైనే దాన్ని ఆపేశారు. దీంతో ప్యాట్నీ ఫ్లై ఓవర్త్ పాటు సమీప ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ప్యాట్నీ ఫ్లై ఓవర్ వద్దకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. సికింద్రాబాద్ నుంచి బేగంపేట వైపు ఆర్మీ ట్రక్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఆర్మీ ట్రక్కును ఫ్లై ఓవర్ మీద నుంచి పోలీసులు తొలగించారు.