కుత్బుల్లాపూర్, జనవరి 4 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో సుపరిచితమైన పాలన దిశగా ముందడుగులు వేస్తున్నామని, రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం జీడిమెట్ల డివిజన్, ఫస్ట్ అవెన్యూ కాలనీలో రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం కాలనీకి ఆనుకొని ఉన్న నాలా మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కాలనీల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ అర్బన్ జిల్లా కార్యదర్శి భరత్‌సింహారెడ్డి, కార్పొరేటర్ చెరుకుపల్లి తారాచంద్రారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు, కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, కాలనీవాసులు విజయ్, ధనుంజయ్య, యాదగిరియాదవ్, సత్యం, మురళి, నర్సింగరావు, ఝాన్సీ, నార్లకంటి దుర్గయ్య, సాయిలు, ప్రతాప్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.