Toxic | ‘టాక్సిక్’ రిలీజ్‌పై భారీ అప్డేట్.. ఆగస్టులోనే యష్ సినిమా, అభిమానుల్లో పెరిగిన ఆసక్తి
Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ తదుపరి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ తదుపరి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.సినిమా ప్రకటించిన సమయంలోనే ‘టాక్సిక్’పై భారీ హైప్ ఏర్పడింది. అయితే చిత్ర బృందం నుంచి వరుస అప్డేట్స్ రాకపోవడం, విడుదల తేదీపై స్పష్టత లేకపోవడం వల్ల సాధారణ ప్రేక్షకుల్లో ఆసక్తి కొంత తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పలుమార్లు విడుదల వాయిదా పడుతుందనే ప్రచారం జరగడం కూడా సినిమాపై ప్రభావం చూపిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. జూన్ 21న ‘టాక్సిక్’కు సంబంధించిన కీలక అప్డేట్ రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇక తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘టాక్సిక్’ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఆగస్టు నెలలో ఇప్పటికే పలు మీడియం రేంజ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ‘టాక్సిక్’ రాకతో బాక్సాఫీస్ సమీకరణాలు ఎలా మారతాయనే చర్చ కూడా మొదలైంది. భారీ బడ్జెట్, పాన్ ఇండియా స్థాయి క్రేజ్ కలిగిన యష్ సినిమా విడుదలైతే ఇతర చిత్రాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు క్లాష్‌లను నివారిస్తూ ప్రత్యేక తేదీని ఫిక్స్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ‘కేజీఎఫ్’ చిత్రాలకు ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీంతో ‘టాక్సిక్’కు కూడా ఆయన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి యష్ స్వయంగా నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్, పీరియాడిక్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- geetu mohandas
- kgf
- look
- producers
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

