Aamir Khan | మూడో పెళ్లిపై స్పందించిన ఆమిర్ ఖాన్.. గౌరీ స్ప్రాట్‌తో సింపుల్ రిజిస్టర్ మ్యారేజ్!
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో వివాహం చేసుకోబోతున్నట్లు తాజాగా ఆయన స్వయంగా వెల్లడించారు. గత కొంతకాలంగా వీరిద్దరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండగా, ఇప్పుడు ఆమిర్ ఖాన్ అధికారికంగా స్పందించి అందరికీ క్లారిటీ ఇచ్చారు
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో వివాహం చేసుకోబోతున్నట్లు తాజాగా ఆయన స్వయంగా వెల్లడించారు. గత కొంతకాలంగా వీరిద్దరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండగా, ఇప్పుడు ఆమిర్ ఖాన్ అధికారికంగా స్పందించి అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ తన వివాహం గురించి మాట్లాడారు. జులై 5న గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. ముంబైలోని తన నివాసంలో అత్యంత సాదాసీదాగా రిజిస్టర్ మ్యారేజ్ జరగనుందని చెప్పారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
పెళ్లి తమ జీవితంలో మొదటి ప్రాధాన్యత కాకపోయినా, తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమిర్ పేర్కొన్నారు. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఆయన కొద్ది రోజుల పాటు సినిమా షూటింగ్‌లకు కూడా విరామం ఇచ్చినట్లు సమాచారం.
గతేడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా గౌరీ స్ప్రాట్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు ఆమిర్ ఖాన్. అప్పటికే తాము దాదాపు ఏడాదిన్నర కాలంగా ప్రేమలో ఉన్నామని వెల్లడించారు. అప్పటి నుంచి వీరి పెళ్లిపై అనేక వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా ఆమిర్ స్వయంగా స్పందించడంతో ఈ వార్తలకు అధికారిక ముద్ర పడింది.
ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం కావడం విశేషం. మొదట ఆయన రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఇరా అనే ఇద్దరు సంతానం ఉన్నారు. అనంతరం 2002లో ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత దర్శకురాలు కిరణ్ రావును రెండో వివాహం చేసుకున్న ఆమిర్‌కు ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. 2021లో ఆమిర్, కిరణ్ రావు పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇప్పుడు 61 ఏళ్ల వయసులో గౌరీ స్ప్రాట్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు ఆమిర్ ఖాన్. పెళ్లి వేడుక అత్యంత సింపుల్‌గా జరగనున్నప్పటికీ, బాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వివాహం అనంతరం ఆమిర్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించనున్నారని, బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

