దండుమైలారం గ్రామానికి చెందిన హైదరాబాద్ కిక్రెట్ అధ్యక్షుడు జగన్మోహన్రావు తనకు జన్మనిచ్చిన ఊరు రుణం తీర్చుకోవాలనుకున్నారు. సొంత నిధులు, రౌండ్‌టేబుల్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సుమారు రూ.75 లక్షలతో ప్రాథమిక పాఠశాల భవనాన్ని సకల హంగులతో ప్రైవేటుకు దీటుగా నిర్మించారు. ఆయన సేవలను వందేమాతరం ఫౌండేషన్ గుర్తించింది.
సోమవారం రవీంద్రభారతిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో జగన్మోహన్రావుకు విద్యాదాత పురస్కారాన్ని అందించింది. వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ, సెయింట్ సంస్థ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ దేవసేన నుంచి జగన్మోహన్రావు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని, గ్రామంలో ఎలాంటి ఇబ్బందులున్నా..తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని జగన్మోహన్రావు అన్నారు.
– ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 10