Harish Rao | రేవంత్ రెడ్డి మార్షల్స్‌తో మమ్మల్ని ఎత్తడం కాదు.. మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఎత్తు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అదే మహబూబ్ నగర్ జిల్లాలో భీమా ప్రాజెక్టులో 3 మోటార్లు ఉంటే ఒక్క మోటార్ మాత్రమే నడుపుతున్నారు. నికర జలాల కేటాయింపులున్న ప్రాజెక్ట్ భీమా. కానీ ఏ జలాల కేటాయింపులు లేని, బేసిన్ లేని వెలిగొండకి మాత్రం చంద్రబాబు నీళ్లు తీసుకుపోతడు.. బేసిన్లు ఉన్న నికర జలాల కేటాయింపులు ఉన్న అన్ని అనుమతులున్న భీమా మోటార్లు ఎందుకు నడపడం లేదు రేవంత్ రెడ్డి.. ఇదేనా నీకు పాలమూరు మీద ఉన్న ప్రేమ అని హరీశ్ రావు అడిగారు.
కరువు పీడిత ప్రాంతం నడిగడ్డ, గద్వాల, అలంపూర్ ప్రాంతానికి నీళ్లిచ్చే నెట్టంపాడులో 4 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారన్నారు హరీశ్ రావు . కోయిల్ సాగర్‌లో 3 మోటార్లు ఉంటే ఒక్కటే నడుపుతున్నారు. రెండు మోటార్లు నడిపితేనే కోయిల్ సాగర్ నిండడానికి 3 నెలలు పడుతుంది.. ఇప్పుడు నువ్వు ఒక్కటే మోటార్ నడిపితే అది నిండడానికి 6 నెలలు పడుతుంది. 6 నెలల వరకు జూరాల ప్రాజెక్టులో నీళ్లు ఉంటాయా..? కోయిల్ సాగర్ నిండుతదా అని ప్రశ్నించారు. నీళ్లు ఉండి మోటార్లు నడపలేని చాతకాని ముఖ్యమంత్రిని నిన్నే చూస్తున్నానన్నారు.
బీఆర్ఎస్ ఉన్నప్పుడు 2014-15 నుండి 2023-24 వరకు ప్రతి సంవత్సరం వచ్చిన కృష్ణ నది నీళ్లలో 45 శాతం నుండి 30 శాతం ఎత్తామని.. కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25లో 28.49 శాతం నీళ్లు ఎత్తారు, 2025-26లో 25 శాతం మాత్రమే ఎత్తారని హరీశ్ రావు తెలిపారు. దీన్ని బట్టి ఎవరు తెలంగాణ ప్రయోజనాలు కాపాడారో అర్థం కావడం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణ జలాల్లో అతి తక్కువ సాగు నీరు వాడుకున్నది ఈ మూడు సంవత్సరాలలోనేనన్నారు.
రేవంత్ రెడ్డి మార్షల్స్‌తో మమ్మల్ని ఎత్తడం కాదు.. మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఎత్తు
మహబూబ్ నగర్ జిల్లాలో భీమా ప్రాజెక్టులో 3 మోటార్లు ఉంటే ఒక్క మోటార్ మాత్రమే నడుపుతున్నారు
ఏ కేటాయింపులు లేని వెలుగొండకి మాత్రం చంద్రబాబు నీళ్లు తీసుకుపోతుంటే.. అన్ని అనుమతులున్న భీమా… https://t.co/7Mj0wMvDXW pic.twitter.com/Sa7PGiwJ9g
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026
బీఆర్ఎస్ ఉన్నప్పుడు 2014-15 నుండి 2023-24 వరకు ప్రతి సంవత్సరం వచ్చిన కృష్ణ నది నీళ్లలో 45 శాతం నుండి 30 శాతం ఎత్తాము
కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25లో 28.49 శాతం నీళ్లు ఎత్తారు, 2025-26లో 25 శాతం మాత్రమే ఎత్తారు
దీన్ని బట్టి ఎవరు తెలంగాణ ప్రయోజనాలు కాపాడారో అర్థం కావడం లేదు… https://t.co/Sh7gihuHnE pic.twitter.com/EWI9FKtPQ9
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026
KCR | కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి.. రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ వ్యూహం రివర్స్
Nitin Gadkari | హైవే పనులు ఆలస్యంపై సిగ్గుపడుతున్నా.. ప్రారంభోత్సవానికి నేను రాను: నితిన్ గడ్కరీ