ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలో దాదాపు 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్, టీఆర్ఎస్ అనుకూల నినాదాలతో ఆర్ట్ కళాశాల మార్మోగింది. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, రంగులు చల్లుకుని, మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున గుమిగూడి నృత్యాలు చేశారు.
ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఒక్కొక్క అంశంలో సంపూర్ణంగా ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకుడు బండారి వీరబాబు, మంద సురేశ్, కోతి విజయ్, శిగ వెంకట్, కృష్ణ, ఆవాల హరిబాబు, జీడీ అనిల్, శశిపాల్, కొంపల్లి నరేశ్, శివ, సందీప్, రేణు, రాంబాబు, జానయ్య, సంపత్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
నియామకాలతో మరింత సర్వతోముఖాభివృద్ధి: కిరణ్‌గౌడ్
ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలతో రాష్ట్రం మరింత సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్‌గౌడ్ చెప్పారు. ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కేసీఆర్ ప్రకటనతో ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రెరీ ఎదుట కిరణ్‌గౌడ్, వల్లమల కృష్ణ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేసీఆర్ ప్రకటనతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయని అన్నారు.
ప్రతీ ఏడాది ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించడం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పల్లా ప్రవీణ్‌రెడ్డి, మంద సురేశ్, పడాల సతీశ్, గదరాజు చందు, స్వామియాదవ్, జిల్లా నాగయ్య, శోభన్, శ్రీమాన్, జానీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.