సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : చేనేత కార్మికులు తయారు చేసిన దుస్తులకు మరింత ఆదరణ పెంచడంతోపాటు భావితరాలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో చేనేత దినోత్సవం సందర్భంగా రూట్స్ డిజైన్, ఫిల్మ్, మీడియా కళాశాల ఆధ్వర్యంలో శనివారం జూబ్లీహిల్స్‌లోని రూట్స్ కళాశాలలో చేనేత వస్ర్తాలు, హస్తకళల ప్రదర్శన, అమ్మకాలు శనివారం ప్రారంభమైంది. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల చేనేత కుటుంబాలకు చెందిన పలువురు వృత్తిదారులు వస్ర్తాలు, కాటన్ దుస్తులు, హ్యాండ్లూమ్స్, కాటన్ చీరలు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు.
చేనేత కార్మికులకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తిచేసి కొత్తగా ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించిన విద్యార్థులకు కూడా కాటన్ దుస్తులు కొనుగోలు చేసేలా ఈ ప్రదర్శనలో లేటెస్ట్ దుస్తులను ఉంచారు. ఫ్యాషన్ డిజైనర్లు, చేనేత కార్మికులు, హస్తకళాకారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తున్నది.
ఇలాంటి ప్రదర్శనల ద్వారా చేనేత వృత్తిపై ఆధారపడిన మాలాంటి వాళ్లకు కొంతమేలు జరుగుతుంది. చేనేత వస్ర్తాలను ఇంట్లోనే తయారు చేస్తాం. ఏపీ, తెలంగాణతోపాటు ఆయా రాష్ర్టాల్లో చేపట్టే ఎగ్జిబిషన్లలో పాల్గొని విక్రయాలు చేసుకుంటున్నాం. -ధనలక్ష్మి, మచిలీపట్నం
ఫ్యాషన్ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. అయినా కాటన్, చేనేత వస్ర్తాలకు మాత్రం డిమాండ్ తగ్గదు. ఫ్యాషన్ డిజైనర్‌గా స్థిరపడాలనుకునే వారు పూర్తిస్థాయిలో శ్రమించాలి. – శ్రీహిత కోటగిరి, ఫ్యాషన్ డిజైనర్
గతంలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో కేవలం మహిళలకే ప్రాధాన్యం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో మగవారు కూడా ఫ్యాషన్‌పై దృష్టి పెడుతున్నారు. కొత్తకొత్త మోడల్స్‌ను అందుబాటులోకి తేగలిగితే అబ్బాయిలకు కూడా ఈ రంగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. -టి.వి.సుబ్రహ్మణ్యం, ఫ్యాషన్ డిజైనర్
గిరిజన ఆచారాలకు మాత్రమే పరిమితమైన ఆభరణాలను ఇతర వర్గాలకు చెందిన మహిళలు సైతం ఇష్టపడుతున్నారు. దీనివల్ల మాకు ఉపాధి లభిస్తున్నది. ప్రత్యేకంగా కుట్లు,అల్లికలతో తయారు చేసిన బంజారా డ్రెస్‌లను కొనుగోలు చేస్తున్నారు. -జ్యోతిబాలాజీ, ఎల్లమ్మతండా, ఇబ్రహీంపట్నం