Hyderabad | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నగరంలోని రోడ్లతో పాటు రవాణా రంగంలో అనేక ఇబ్బందులు ఉండేవి. ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయా అని నాకు నేనే ప్రశ్నించుకునేవా డిని. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభు త్వం ఏర్పాటైన తర్వాత అత్యంత వేగంగా నగర ప్రజల కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, రోడ్లు, కాలనీల అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో రోడ్లన్నీ అద్దంలా మెరుస్తున్నాయి. దశాబ్దాలుగా ప్రయాణికులు పడ్డ అవస్థలకు చెక్ పెట్టారు.
రవాణా వ్యవస్థలో సమూల మార్పులు జరిగాయి. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంతో పాదచారుల ప్రాణాలకు ముప్పు తప్పింది. రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలతో పాటు గ్రేటర్ పరిధిలో అనేక ప్రధాన జంక్షన్లలో అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరించారు. దీంతో ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుండడంతో ప్రయాణం సులువైంది. ఇంతకుముందు ఎక్కడ ఏ గుంత ఉందోననే భయం ఉండేది. ఇప్పడా పరిస్థితి లేదు. రోడ్లపై గుంతలున్నాయని సమాచారం వచ్చిన క్షణాల్లోనే వాటిని పూడ్చేస్తున్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. మెజారిటీ, మైనారిటీ అనే తేడా లేకుండా అన్ని వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతున్నది. ఇలాంటి ప్రభుత్వం మరింత కాలం పనిచేసేలా దీవిస్తే మెరుగైన, నాణ్యమైన సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది. మెట్రో రైలు నగరానికి తలమానికంగా ఉన్నది. ప్రజారవాణాలో మెరుగైన సేవలు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు.
– సర్దార్ జోగిందర్ సింగ్, గురుద్వారా సాహిబ్ జాయింట్ సెక్రటరీ , అమీర్పేట