Groups Exams | మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 18: నవంబర్ 17, 18వ తేదీల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు జిల్లాలో ఏడు స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ – 2, 3 పరీక్షలపై సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి, సభ్యులు తన కార్యాలయం నుంచి శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మేడ్చల్ కలెక్టరేట్ నుంచి డీఆర్ఓ హాజరయ్యారు. జిల్లాలో 118 పరీక్షా కేంద్రాలలో 71,356 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తామని డీఆర్వో వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.