జవహర్‌నగర్, ఆగస్టు 25 : ప్రభుత్వం కార్పొరేషన్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని జవహర్‌నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం కార్పొరేషన్‌లోని 4వ డివిజన్ కార్పొరేటర్ నాగరాణి వెంకటేశ్‌గౌడ్, 6వ డివిజన్ కార్పొరేటర్ మెట్లు ఆశాకుమారి ఆధ్వర్యంలో రూ. 17లక్షలతో చేపట్టిన అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ కావ్య మాట్లాడుతూ జవహర్‌నగర్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సింగన్న బాల్‌రాజ్, కృష్ణయాదవ్, అమర్, కృష్ణ, శ్రీను, అశోక్, టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇందిర, కాలనీవాసులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం ..
మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 25 : అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు ఈస్ట్ గాంధీ నగర్ కాలనీ రోడ్డు నంబర్ 3లో రూ. 22 లక్షలలో చేపట్టిన సీసీ రోడ్డు పనులను గురువారం వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ వార్డులోని అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలతో పాటు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రవణ్, ఉపాధ్యక్షులు జస్వంత్ సింగ్ పాల్గొన్నారు.
జగ్గంగూడలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు..
శామీర్‌పేట, ఆగస్టు 25 : మండల పరిధిలోని జగ్గంగూడలో సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్‌రెడ్డి రూ.8 లక్షలతో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు భూపాల్‌రెడ్డి, జహంగీర్, అనిల్‌రెడ్డి, సాయిబాబు, కో ఆప్షన్ సభ్యులు బీరప్ప, వేమయ్య, నాయకులు మురళీగౌడ్, నరేందర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, మహేశ్, శివ, జంగారెడ్డి, నాగరాజు, ప్రవీణ్‌గౌడ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.