బండ్లగూడ, మే 4. రాష్ట్రంలో రెజ్లింగ్ పోటీలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ క్రీడా చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలను హైదరాబాద్ హిమాయత్‌సాగర్‌లో నిర్వహించారు. ఇందులో అండర్ 17 కేటగిరీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువతీయువకులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఫ్రీ స్టైల్, గ్రోకో రోమన్, మహిళల రెజ్లింగ్ అనే మూడు కేటగిరీల్లో పాల్గొన్నారు.
ఈ పోటీల సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రెజ్లింగ్ పోటీలకు ఎంతో ఆదరణ ఉందని తెలిపారు. తెలంగాణ ఆమెచూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీలకు వెళ్లేవారికి వన్‌వే ప్రయాణ ఖర్చులను భరించడానికి చొరవ తీసుకుంటున్నారని పేర్కొన్నారు.