కందుకూరు : కుల వృత్తుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర రజకాభివృద్ధి నాయకులు సోమవారం మంత్రిని కలిసి మండల కేంద్రంలో రజకాభివృద్ధి సంస్థ కు స్థలంతో పాటు పక్కా భవనాన్ని నిర్మించి ఇవ్వాలని వినతి పత్రం సమర్సించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రజకాభివృద్ధి కమ్యూనిటి హాల్ నిర్మాణం కోసం స్థలం ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. రజకులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రజకులు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. సీఎం కేసీఆర్ అన్ని కులాల వారికి న్యాయం చేస్తున్నట్లు చెప్పారు. రజకులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.
కార్యక్రమంలో రజకాభివద్ధి మండల అధ్యక్షుడు అక్కనపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్; మల్లేష్, గిరి, వెంకటేష్; రాజు, నరేష్, క్రిఫ్ణ, సత్తయ్య, జంగయ్య,జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి,మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్ పాల్గొన్నారు.