Common Pass | కామన్ పాస్ ధరలు తగ్గించిన ప్రభుత్వం
కామన్ పాస్ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్ తీసుకున్నది. ప్రయాణికుల నుంచి ఎదురైన విముఖత, అభ్యర్థనలతో హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల కామన్ పాస్ ధరను సగానికి పైగా తగ్గించింది.
హైదరాబాద్ : కామన్ పాస్ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్ తీసుకున్నది. ప్రయాణికుల నుంచి ఎదురైన విముఖత, అభ్యర్థనలతో హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల కామన్ పాస్ ధరను సగానికి పైగా తగ్గించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రూ.400గా ఉన్న రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.275కు తగ్గించాం. ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించాం. ఈ పాస్ ద్వారా రోజుకు 4 సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుంది.
ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను ఏకంగా రూ.4,000కు తగ్గించాం. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించాం. ఈ పాస్ ద్వారా నెలలో గరిష్ఠంగా 50 రౌండ్ ట్రిప్పులకు అనుమతి ఉంటుందన్నారు. ఈ ధరల తగ్గింపుతో నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ వినియోగదారులకు రూ.4,500 ఆదా అవుతుంది. రోజువారీ ఉమ్మడి పాస్ వినియోగదారులకు రూ.125 ఆదా అవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Common Pass | కామన్ పాస్ ధరలు తగ్గించిన ప్రభుత్వం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సెన్సేషన్.. 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా టికెట్ల అమ్మకాలు!
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

