మారేడ్‌పల్లి, మార్చి 26: పెళ్లి కావడం లేదని ఓ ప్రభుత్వ వైద్యుడు జీవితం పై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ర్టానికి చెందిన పురోహిత్ కిశోర్ (34) కొంత కాలం క్రితం కుటుంబ సభ్యులతో కలిసి కాప్రా సైనిక్‌పురి లో నివాసం ఉంటూ…అల్వాల్‌లోని బస్తీ దవఖానాలో వైద్యుడిగా పని చే స్తున్నాడు.
అయితే కిశోర్ కు గత కొద్ది రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఇటీవలే ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. అనంతరం కొద్ది రోజుల తరువాత ఆ పెళ్లి సంబంధం రద్దైంది. దీంతో అప్పటి నుంచి మానసికంగా డాక్టర్ కిశోర్ కుంగిపోతున్నాడు. అప్పటి నుంచి పెళ్లి సంబంధాలు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మృతుడు కిశో ర్బుధవారం ఉదయం తన నివాసం నుంచి ద్విచక్ర వాహనం పై కెవెల్లరీ బ్యారక్ రైల్వే స్టేషన్ వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.