సిటీబ్యూరో, జూలై 23(నమస్తే తెలంగాణ): రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆస్తులు కోల్పోతున్నవారికి నష్టపరిహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. హైకోర్టులో ఇప్పటికే నడుస్తున్న కేసుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణ, చట్టపరమైన అంశాలు, పరిహారం చెల్లింపుపై ఉన్న సందేహాల నివృత్తి వంటి అంశాలపై రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ చైర్మన్ సతీష్ గుప్తా ఆధ్వర్యంలో ఈనె 28న ఖార్ఖానాలో హైకోర్టు న్యాయవాదులు, న్యాయ నిపుణులతో.. బాధితులు సమావేశం కానున్నారు. దాదాపు 800కిపైగా బాధితులు, భూ యజమానులు ఈ సమావేశంలో పాల్గొంటారని సమాచారం.