శంషాబాద్ రూరల్, జూన్ 18: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆదివారం ఓ ప్రయాణికురాలి నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆదివారం ఎమిరేడ్స్ 524 విమానం వచ్చింది. ఆ విమానంలో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. ఓ ప్రయాణికురాలు వద్ద 726 గ్రాముల బంగారం లభించింది. పట్టుబడిన బంగారం విలువ రూ.45, 37,500 ఉంటుందని అధికారుల తెలిపారు. సదరు ప్రయాణికురాలు లోదుస్తువుల్లో దాచుకొని బంగారాన్ని తీసుకువస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా.. మరో ప్రయాణికుడి వద్దనున్న పిల్లలకు పాలు తాగే డ్రింకస్ మిక్స్‌ను పరిశీలించగా ఫౌండర్ రూపంలో ఉన్న 127 గ్రాముల బంగారం పట్టుబడింది. ఈ బంగారం విలువ రూ. 7,77,621 ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.