Hyderabad | పారిశుద్ధ కార్మికురాలి స్థలాన్ని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు
నిలువ నీడ కల్పించేందుకు దివంగత వైఎస్ఆర్ ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని కాంగ్రెస్ నేతలు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు ఆరోపించారు.
- దాడి చేసి గుడిసె నేలమట్టం.. ప్రశ్నిస్తే హత్యాయత్నం
- జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలు నారాయణమ్మ ఆరోపణ
- దానం నాగేందర్ అనుచరుల దాదాగిరి
నిలువ నీడ కల్పించేందుకు దివంగత వైఎస్ఆర్ ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని కాంగ్రెస్ నేతలు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు ఆరోపించారు. ఖైరతాబాద్ జోన్‌లోని జూబ్లీహిల్స్ సర్కిల్- 18 పరిధిలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న డేరంగుల నారాయణమ్మ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 20 ఏండ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుధ్య కార్మికురాలిగా సేవలందిస్తున్నానని చెప్పారు.
– ఖైరతాబాద్, మే 2
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయనను కలిసి తన గోడును వెల్లబోసుకున్నానని నారాయణమ్మ తెలిపారు. తనకు నిలువ నీడలేదని, ఏదైనా జాగ చూపిస్తే గుడిసె వేసుకుంటానని చెప్పగా, వెంటనే స్పందించిన వైఎస్ఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఫిల్మ్‌నగర్‌లోని వినాయక్‌నగర్‌లో 124 గజాల స్థలం కేటాయించారన్నారు. చిన్న గుడిసె వేసుకొని భర్త, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తుండగా, ఆ స్థలం విలువైంది కావడంతో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, అతని అనుచరుల కండ్లు పడ్డాయన్నారు. 20 ఏండ్లుగా తన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తూనే ఉన్నారని, 20 సార్లు గుడిసెను కూలగొట్టించారని, రెండు సార్లు తగులబెట్టించారన్నారు.
తన భర్త మరణించిన తర్వాత ఆ నాయకుల వేధింపులు పెరిగాయని, ఆ స్థలం విషయంలో తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. 20 ఏండ్లుగా ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నాయకుడు మామిడి నర్సింగ్ రావు, వారి అనుచరులు తన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, అనేక సార్లు దాడులు సైతం చేయించారని, ప్రాణభయంతో బాల్‌రెడ్డినగర్‌లో ఉన్న తన కుమార్తె ఇంట్లో తలదాచుకుంటున్నట్లు నారాయణమ్మ తెలిపారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పేదరికంపై దయతలచి భూమి ఇస్తే అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, అతని అనుచరులు తన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, తన గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని చెప్పారు. ఎమ్మెల్యే దానం, అతని అనుచరులతో తనకు ప్రాణగండం ఉందని, తనకు, తన కుటుంబానికి ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.
ఎమ్మార్వో అనితారెడ్డి తప్పుడు కేసు
ప్రభుత్వం అధికారికంగా ఫిల్మ్‌నగర్‌లోని వినాయకనగర్‌లో 124 గజాల స్థలం కేటాయించారని, రాళ్ల గుట్టలుగా ఉన్న ఈ స్థలాన్ని తాను, తన కుటుంబ సభ్యులతో చదును చేసుకొని గుడిసె వేసుకున్నానన్నారు. బల్దియాలో రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇంటి. నం.8-2-293/82/వీఎన్/392 కేటాయించారన్నారు. ప్రస్తుతం కబ్జాదారులు తాను వేసుకున్న గుడిసెను నేలమట్టం చేశారని, ఇటీవల తన స్థలంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లగా, షేక్‌పేట ఎమ్మార్వో తాను ఆ భూమిని కబ్జా చేశానంటూ తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. తన స్థలాన్ని కబ్జా చేస్తున్నా పట్టించుకోని ఎమ్మార్వో ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని తానే కబ్జా చేశానంటూ ఫిర్యాదు చేయడం అన్యాయమన్నారు.
పారిశుద్ధ కార్మికురాలి స్థలాన్ని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు
కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మనుషుల నుండి నన్ను కాపాడండి రేవంత్ రెడ్డి సారు
దానం నాగేందర్ అనుచరులు నన్ను చంపాలి చూస్తున్నారు అంటూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఓ పారిశుద్ధ కార్మికురాలి… pic.twitter.com/0fn2ZCWYfc
— Telugu Scribe (@TeluguScribe) May 3, 2025
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

