డెంగీ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒకరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఆ వ్యాధి ఎకువగా నమోదైన ఎన్బీటీ నగర్ వార్డులో జోనల్ కమిషనర్ రవికిరణ్, చీఫ్ ఎంటమాలజీ రాంబాబు, డీసీ రజనీకాంత్ రెడ్డితో కలిసి మేయర్ జ్వర పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ ఎన్బీటీ నగర్లో ఇంటింటికీ తిరిగి డెంగీ వ్యాధి
- జ్వర పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- 4846 కాలనీల్లో పరీక్షలు
- డెంగీ నివారణకు చర్యలు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒకరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఆ వ్యాధి ఎకువగా నమోదైన ఎన్బీటీ నగర్ వార్డులో జోనల్ కమిషనర్ రవికిరణ్, చీఫ్ ఎంటమాలజీ రాంబాబు, డీసీ రజనీకాంత్ రెడ్డితో కలిసి మేయర్ జ్వర పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ ఎన్బీటీ నగర్లో ఇంటింటికీ తిరిగి డెంగీ వ్యాధి నివారణకు చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇంటి లోపల, ఇంటి బయట పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కుటుంబ సభ్యులందరూ కలిసి పరిసరాలను పరిశుభ్రం చేయాలన్నారు.
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ఒకొకరికీ రెండు మూడు కాలనీల బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. దోమల వ్యాప్తితో వచ్చే వ్యాధుల పట్ల ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. దోమల నివారణ చర్యలు, ఫాగింగ్, నీరు నిలిచిన ప్రాంతాల్లో దోమలు ఉత్పత్తి కాకుండా మందును పిచికారీ చేయాలని మేయర్ సూచించారు. ఆశ వరర్ల ద్వారా జ్వరం వచ్చిన వ్యక్తుల నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రతి ఒకరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంటమాలజీ, పారిశుధ్య కార్మికులకు భద్రత కిడ్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా శానిటేషన్ కోసం వీల్ డస్ట్‌బిన్ లను కూడా పారిశుధ్య కార్మికులు అందజేశారు. ఈ సమావేశంలో సీనియర్ ఎంటమాలజీ రజనీ, రజిత, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాలా పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: మేయర్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): నగరంలో వరద నివారణ చర్యల్లో భాగంగా చేపడుతున్న నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం రూ. 56 కోట్ల వ్యయంతో చేపడుతున్న బలాపూర్ నాలా పనులను చింతల్‌బస్తీ ప్రేమ్‌నగర్ కాలనీ వద్ద మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద ముంపు సమస్య రాకుండా ఉండేందుకు రూ. 958 కోట్లతో 37 పనులను చేపట్టినట్టు తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేయర్ వెంట జోనల్ కమిషనర్ రవికిరణ్, సీఈ కిషన్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

