Food Safety | సిటీబ్యూరో: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ, వైద్యారోగ్యశాఖ టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదం మోపుతున్నది. తాజాగా కాటేదాన్‌లోని యుమని ఫుడ్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ విభాగం విస్తృత తనిఖీలు చేపట్టింది.
అధికారులు స్టోర్ రూంలో సింథటిక్ ఫుడ్ కలర్ (టాట్రాజిన్) 50 కిలోలను గుర్తించి సీజ్ చేశారు. ఈ కలర్‌ను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో ఉపయోగిస్తున్నట్లు తేల్చారు. 400 కిలోల అల్లం ప్యాకెట్లను సీజ్ చేసి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. పరిసర ప్రాంతాలు సాలె పురుగులు, ఇతర క్రిమికీటకాలు ఉన్నట్లు గుర్తించారు. కాటేదాన్‌లోని ఎస్కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తయారీ కేంద్రంలో అపరిశుభ్రమైన వాతావరణం ఉన్నట్లు పేర్కొన్నారు. 1000 కేజీల ప్యాకెట్లను నమూనాలకు ల్యాబ్‌కు పంపారు. సంబంధిత నిర్వాహకులపై జరిమానా, ఇతర చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.