సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ రోనాల్డ్‌రాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కమిషనర్ తన చాంబర్లో టాన్ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
పాదచారుల ప్రమాదాల నివారణకు అవసరమైన చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు స్థలం గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నగరంలో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను చేపట్టగా ఇప్పటి వరకు 11 అందుబాటులోకి వచ్చాయన్నారు.