సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్: గ్రేటర్ జనంపై ‘ఆగని చలాన్ల మోత’ అనే శీర్షికతో సోమవారం ‘నమస్తే’లో ప్రచురితమైన వార్తను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. వచ్చే నెల 28వ తేదీలోపు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది.
చెత్త, నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై పడవేసినందుకు జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లలో చలాన్ల ద్వారా భారీ ఎత్తున జరిమానా వసూలు చేసినప్పటికీ ఇంటింటి చెత్త సేకరణ, రోడ్లపై చెత్త/ నిర్మాణ వ్యర్థాలు తొలగింపు వంటి పనుల్లో బల్దియా విఫలమైందని, పౌరసేవలను అందించడంలో పరిపాలనా లోపమేనని వచ్చిన వార్తపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశించింది.