నిర్లక్ష్యం సహించం

- అధికారులు ఉదయం ఆరు కల్లా ఫీల్డ్‌లో ఉండాల్సిందే
- పారిశుధ్య పర్యవేక్షణ తప్పనిసరి లేదంటే చర్యలు తప్పవు
- బాధ్యత మరిచి రోడ్లపై చెత్త వేసే వారికి జరిమానాలు
- స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా అధికారులతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సమీక్ష
- నగరంలో పలు ప్రాంతాల్లో మేయర్ విజయలక్ష్మి పర్యటన
చెత్త తొలగింపు ప్రాథమిక విధి అని.. పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ అన్నారు. స్వచ్ఛత కార్యక్రమాలపై అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నగరంలో చేపడుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా సోమవారం ఆయన జీహెచ్ఎంసీ కార్యాలయంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా సర్కిళ్ల పరిధిలోని ఈఈ, డీఈ, ఏఎంహెచ్ఓ, ఏఎంసీ, ఏసీపీలు పారిశుధ్య నిర్వహణను వందశాతం చేపట్టాలన్నారు.
ప్రతిరోజు ఉదయం ఆరుగంటల లోపే అధికారులు ఫీల్డ్‌లో పర్యటించాలని సూచించారు.ఎన్నిసార్లు చెప్పినా వినకుండా రోడ్లపై చెత్త వేస్తున్న వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. మరోవైపు నగరంలో పారిశుధ్య నిర్వహణ పనులపై మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక పర్యటనలుకొనసాగిస్తున్నారు. సోమవారం సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. అనేక చోట్ల చెత్త పేరుకుపోవడంపై అధికారుల నుంచి వివరణ కోరారు. ఇదిలా ఉంటే మేయర్‌కు మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి పారిశుధ్య పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఎక్కడా చెత్త పోగుపడకుండా చూడాలని కోరారు.
- గ్రేటర్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను సహించేది లేదని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్వింద్ కుమార్ హెచ్చరించారు.
- జీహెచ్ఎంసీ కార్యాలయంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్ఓలతో పారిశుధ్య కార్యక్రమాలపై ముఖ్య కార్యదర్శి సోమవారం సమీక్షించారు.
- మరికొద్ది రోజుల్లో వర్షాలు ఆరంభమవుతున్న దృష్ట్యా రహదారులపై పూర్తి స్థాయిలో చెత్తను ప్రతి రోజు తొలగించడం ద్వారా అంటు వ్యాధు లు, కరోనా వ్యాప్తిని నివారించాలని అధికారులకు ఆర్విం ద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
- పట్టణాలలో పారిశుధ్య డ్రైవ్‌పై మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని వివరించారు. ఆయా సర్కిల్ పరిధిలోని ఈఈ, డీఈ, ఏఎంహెచ్ఓ, ఏఎంసీ, ఏసీపీలకు నిర్ధారిత పరిధిని నిర్ణయించి ఆ పరిధిలో వంద శాతం పారిశుథ్య కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను ఉంచాలని ముఖ్య కార్యదర్శి సూచించారు.
- నగరంలో చెత్త (వ్యర్థాల) తొలగింపు అనేది ప్రాథమిక విధి అని, వీటిని పూర్తి స్థాయిలో తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తు తం, కరోనా పరిస్థితుల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని అర్వింద్ కుమార్ స్పష్టం చేశారు.
310 ప్రాంతాల్లో చెత్త నిల్వ కేంద్రాలు: లోకేష్ కుమార్
- నగరంలో 310 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెత్త నిల్వ కేంద్రాలు, 700 తక్కువ పరిమాణం గల చెత్త నిల్వ ప్రాం తాలు ఉన్నాయని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ వివరించారు.
- చెత్త తరలింపునకు వినియోగించే వాహనాలన్నీ ప్రతి రోజూ ఉదయం ఐదు గంటలలోపే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించేలా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
- పెద్ద పరిమాణంలో చెత్త వ చ్చే ప్రాంతాలపై ఎస్ఎఫ్ఏలను నియమించి, ఎక్కడి నుం చి ఆ చెత్త వస్తుందో.. ఎవరు వేస్తున్నారన్న అంశాలను పరిశీలించి తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు.
- వీధులను శుభ్రం చేసే కార్మికులకు చెత్తను సేకరించి సమీప గార్బేజ్ పాయింట్లను వేసేందుకు ప్రత్యేక బ్యాగులను అందజేస్తున్నామని, దీని వల్ల చెత్త పాయింట్ల నుంచి చెత్త ను త్వరితగతిన తొలగించవచ్చన్నారు.
- ఇప్పటి వరకు కొత్తగా 320 స్వచ్ఛ ఆటోలు వచ్చాయని, మిగిలినవి దశ ల వారీగా రానున్నాయని కమిషనర్ తెలిపారు. ఎంటమాలజీ, ఈవీడీఎం సిబ్బంది ద్వారా సోడియం హైపోక్లోరైట్ ద్రావకాన్ని స్ప్రే చేశామని లోకేశ్ కుమార్ తెలిపారు.
క్షేత్రస్థాయిలో పర్యటించని అధికారులపై చర్యలు
- ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలలోపే క్షేత్ర స్థాయిలో పర్యటించి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించాలని డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్ఓలను అర్విం ద్ కుమార్ ఆదేశించారు.
- క్షేత్ర స్థాయిలో పర్యటించని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై నిర్లక్ష్యం వహించడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు.
- నగరంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ బాధ్యతారహితంగా రహదారులపై చెత్త వేసే వారిని గుర్తించి జరిమానా విధించాలని ఆర్వింద్ కుమార్ పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- GHMC
- lokesh kumar ias
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

