e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home హైదరాబాద్‌ నిర్లక్ష్యం.. సంహించం

నిర్లక్ష్యం.. సంహించం

నిర్లక్ష్యం.. సంహించం
  • రోడ్ల నిర్వహణ లోపాలపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం
  • బాధ్యులపై చర్యలకు వెంటనే సిఫార్సు
  • బల్దియా ఏఈ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌
  • మరో ఇద్దరు ఇంజినీర్లకు మెమోలు
  • సీఆర్‌ఎంపీ నిర్వహణ ఏజెన్సీకి రూ.లక్ష జరిమానా
  • రోడ్ల ఇబ్బందులపై పౌరుల భాగస్వామ్యం

గ్రేటర్‌ పరిధిలో నూతన రోడ్లు, వాటి నిర్వహణ విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని..జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించరాదని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో కాంప్రెహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌ (సీఆర్‌ఎంపీ) కింద వేసిన రహదారిలో ఉన్న మ్యాన్‌హోల్‌పై మూతలేకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. తక్షణమే బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గురువారం మంత్రి కేటీఆర్‌ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆయన విచారణ జరిపి బల్దియా అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఎం.రాజశేఖర్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ యూసుఫ్‌లను సస్పెండ్‌ చేశారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శివానంద్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ టీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు మెమోలు జారీ చేశారు. పద్మారావునగర్‌ మెయిన్‌రోడ్డు సీఆర్‌ఎంపీ బాధ్యతలు నిర్వహిస్తున్న మెసర్స్‌ కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.లక్ష జరిమానా విధించారు.
రోడ్ల నిర్వహణ, పనుల్లో ఇబ్బందులు ఉన్నా వెంటనే పౌరులు తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. ఇందుకోసం వాట్సాప్‌ నంబర్‌, ట్విట్టర్‌ ఐడీలను అందుబాటులోకి తెచ్చారు. ఫిర్యాదు ఇలా..

జోన్‌/సర్కిల్‌- ఏజెన్సీ వాట్సాప్‌ నంబరు, ట్విట్టర్‌ ఐడీ

  • ఎల్‌బీనగర్‌ : కాప్రా, ఉప్పల్‌, హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌- బీఎస్‌సీపీఎల్‌ ఇన్‌ఫ్రా 9392676237 @CRMPBSCPL
  • చార్మినార్‌ : మలక్‌పేట, సంతోష్‌నగర్‌, చాంద్రాయణగుట్ట చార్మినార్‌, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్‌- ఎం.వెంకటరావు ఇన్‌ఫ్రా 9292672646 @CRMPCHARMINAR
  • ఖైరతాబాద్‌-1 : మెహిదీపట్నం, కార్వాన్‌, గోషామహల్‌ – కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ లి. 9492010698 @CRMP-KNR-KZ1
  • ఖైరతాబాద్‌-2 : ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ – మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రా 9676195050 @CRMPKRD
  • శేరిలింగంపల్లి : యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్‌, ఆర్సీపురం, పటాన్‌చెరు – ఎన్‌సిసి లిమిటెడ్‌ 9652044949 @GHMCNCCSHPALLI
  • కూకట్‌పల్లి : మూసాపేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, అల్వాల్‌ – మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రా 9676265050 @CRMPKPZ
  • సికింద్రాబాద్‌: ముషీరాబాద్‌, అంబర్‌పేట, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, బేగంపేట – కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 77940 96208 @CRMP_KNR_SBZ
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిర్లక్ష్యం.. సంహించం
నిర్లక్ష్యం.. సంహించం
నిర్లక్ష్యం.. సంహించం

ట్రెండింగ్‌

Advertisement