ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Dec 06, 2020 , 06:04:41

కరోనా లక్షణాలుంటే పరీక్ష చేయించుకోండి

కరోనా లక్షణాలుంటే పరీక్ష చేయించుకోండి

  •   హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటి 

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: ఎవరికైనా కరోనా లక్షణాలున్నా, వైరస్‌ సోకిందనే అనుమానాలున్నా వెంటనే నగరంలోని ప్రతి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు కింగ్‌కోఠి, నల్లకుంట ఫీవర్‌,ఉస్మానియా, గాంధీ మెడికల్‌ కళాశాల, నిమ్స్‌ తదితర దవాఖానల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటి ప్రజలకు సూచించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాస్కులు లేకుండా బయటకు రావద్దని, సాధ్యమైనంత వరకు సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఉత్తమమన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సహజంగానే ఫ్లూ వంటి వైరస్‌లు విజృంభిస్తుంటాయని,ఏ మాత్రం అనుమానం ఉన్నా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని డా.వెంకటి సూచించారు.