సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): లైసెన్స్ పొందడం ఎంత బాధ్యతాయుతమో.. అలాగే కొత్తగా లైసెన్స్ పొందినవాళ్లు ఒక్క మొక్క నాటడం కూడా అంతే బాధ్యతాయుతమని ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్స్ పొందేవాళ్లు మొక్క నాటాలని సూచిస్తున్నారు.
పెరుగుతున్న కాలుష్యంతో పర్యావరణం నాశనమవుతుందని.. మొక్కలు విరివిగా నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇబ్రహీంపట్నం ఆర్టీవో సుభాష్ చంద్రారెడ్డి తెలిపారు. కచ్చితంగా మొక్క నాటాలనే నిబంధన అమలు చేస్తున్నామన్నారు. మొక్క నాటి తమకు స్క్రీన్ షాట్ పెట్టాలని సూచిస్తున్నట్టు పేర్కొన్నారు.