సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): నంది అవార్డు గ్రహీత, నాటిక ప్రయోక్త, భూమిక నట శిక్షణ సంస్థ వ్యవస్థాపకుడు ఉదయభాను గరికిపాటి శుక్రవారం కన్నుమూశారు. 72 ఏళ్ల ఉదయభాను నాటక రంగంలో విశేష కృషి చేశారు.
చికడపల్లిలోని తన ఇంట్లో భూమిక అనే నట శిక్షణాలయాన్ని స్థాపించి ఎన్నో ప్రయోగాలు చేసి, పలువురి ప్రశంసలు పొందారు. శుక్రవారం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆయన చర్మం, నేత్రాలను దానం చేశారు.