Food Safety | రెస్టారెంట్లకు వెళ్లి లాగించేస్తున్నారా..? నగరవాసులూ జాగ్రత్త..! ఫేమస్ రెస్టారెంట్లలో చెత్త ఫుడ్..!
Food Safety | ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బయట ఫుడ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరు వీకెండ్ సమయాలతో పాటు ఏదో ప్రత్యేక సందర్భంలో హోటల్స్‌కు క్యూ కడుతున్నారు. ఇంకొందరు ఇంట్లో వండుకునేందుకు సమయం ఉన్నా బయటఫుడ్ని తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Food Safety | ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బయట ఫుడ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరు వీకెండ్ సమయాలతో పాటు ఏదో ప్రత్యేక సందర్భంలో హోటల్స్‌కు క్యూ కడుతున్నారు. ఇంకొందరు ఇంట్లో వండుకునేందుకు సమయం ఉన్నా బయటఫుడ్ని తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో రెస్టారెంట్లకు భారీగానే గిరాకీ పెరుగుతున్నది. ఇంటి ఫుడ్‌ని తీసుకోవడం మాని.. బయట ఫుడ్ లాంగించేస్తున్న వారికి నిజంగా ఇది షాకింగ్ న్యూసే. చిన్న రిస్టారెంట్లే కాదు.. పెద్ద పెద్ద హోటల్స్ వాడుతున్న ఆహార పదార్థాల గురించి తెలిస్తే షాక్ అవుతారు.
పలు హోటల్స్ నాణ్యత లేని వస్తువులు, పాడైన ఆహార పదార్థాలను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో వెల్లడైంది. నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాలు వాడడమే కాకుంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ సరిగా పాటించడం లేదని అధికారులు గుర్తించారు. జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లను ఫుడ్‌సెఫ్టీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బృందాలు విడుదల చేశాయి.
నగరంలోని 24 పెద్ద రెస్టారెంట్లలో చెత్త ఫుడ్ పెడుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించి.. త్వరలో వాటిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆహార పదార్థాలకు సంబంధించిన శాంపిల్స్ సేకరించి నాచారం ల్యాబ్‌కు పంపారు. ఇందులో దాదాపుగా 29 శాంపిల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించగా.. వాటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో స్ట్రీట్ ఫుడ్ అమ్మే ప్రాంతాల్లో సైతం అధికారులు తనిఖీ చేస్తున్నారు. పరిశుభ్రమైన స్థలంలో, కల్తీ లేకుండా ఆహార పదార్థాలను విక్రయించేలా అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | రాత్రి ధనియాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..?
Supreme Court | విభేదాలొచ్చాయని ఆ బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేం : సుప్రీంకోర్టు
Double Bedroom Homes | పేదలకు అందని డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకే..!
Chinese Food | చైనీస్ ఫుడ్ వండేటప్పుడు పాత్రలపై మంటలు వస్తాయి.. ఎందుకని..?
Vatsala Rajagopal | ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

