ఘట్కేసర్,డిసెంబర్18 : పోచారం పోలీస్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో గంజాయి చాక్లెట్లను పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. ఇక్కడి ైప్లెఓవర్ వద్ద గల టీస్టాల్ నిర్వహిస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు వివరాల ప్రకారం రాం నారాయణ షా, కిశోర్ కుమార్ ఇద్దరు అన్నోజిగూడ వద్ద టీస్టాల్ నిర్వహిస్తూ.. అక్కడే గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నారు.
దీనిపై సమాచారం అందుకున్న పోచారం పోలీసులు దాడిచేసి పట్టుకొని విచారించారు. తామే గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నామని ఒప్పుకున్నారు.దీంతో అరెస్టు చేసి వారి వద్దనున్న1190 గ్రాముల 230 చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జగద్గిరిగుట్ట,డిసెంబర్18 : కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న నిందితుడిని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్న సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రింగ్‌బస్తీ కిరాణాషాపులో 13 కేజీల గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న సునీల్‌కుమార్ జాను ఎస్ఓటీ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.