వైద్య రంగం మరింత బలోపేతం : ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత | కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య విభాగాలను మరింత బలోపేతం చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

హైదరాబాద్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య విభాగాలను మరింత బలోపేతం చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలోని హైటెక్స్ లో గల న్యాక్‌లో ఏర్పాటు చేసిన 200 పడకల కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యుమన్ వాల్యూస్(ఐఏహెచ్ వీ) సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సౌజన్యంతో ఈ కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన ‘ధ్యానం’లో ఎమ్మెల్సీ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ఎంబీబీఎస్ పూర్తి చేసిన యువ వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
అంతేకాదు రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ, ఒక్కొక్కరికీ ఐదు కిలోల చొప్పున, వచ్చే రెండు నెలల పాటు ఉచిత బియ్యం అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు.

కొవిడ్ పేషంట్లకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐఏహెచ్‌వీ సంస్థలను ఎమ్మెల్సీ అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగల్ సీపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్‌తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

