హిమాయత్‌నగర్, ఫిబ్రవరి 2: జీవితం మధ్యలో ప్రమాదవశాత్తు ఏదైనా అవయవం కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారు ఇబ్బందులు పడవద్దనే సంకల్పంతో ఈనెల 4న కింగ్‌కోఠిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉచితంగా స్క్రీనింగ్, డయాగ్నసిస్, ఆర్టిఫిషియల్ లింబ్, కాలిఫర్స్, కొలతల శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నారాయణ్ సేవా సంస్థాన్ కో ఆర్డినేటర్ అల్కా చౌదరి, ప్రతినిధులు జస్మిత్ పటేల్, భగవాన్ ప్రసాద్ గౌర్, రితేశ్ జగీర్దార్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను శుక్రవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఆవిష్కరించారు. శిబిరం వచ్చే వారు ఆధార్ కార్డు, వైకల్య ధ్రువీకరణ పత్రం, వైకల్యాన్ని తెలిపే రెండు ఫొటోలు తప్పనిసరిగ్గా తీసుకుని రావాలని సూచించారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు ప్రశాంత్ అగర్వాల్, నరేంద్రసింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.