Free Computer Training | అంబర్‌పేట, మే 29 : బాగ్‌అంబర్‌పేట శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు సంస్థాన్ ప్రతినిధులు తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా సాయిబాబా దేవాలయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్న సంస్థాన్ ప్రస్తుతం సామాజిక బాధ్యత కూడా నిర్వహించాలనే ఉద్దేశ్యతో కంప్యూటర్ శిక్షణను కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన, ప్రత్యేక కారణాలతో చదువు కొనసాగించలేని పదో తరగతి పాస్/ఫెయిల్, ఇంటర్ పాస్/ఫెయిల్ అయిన వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఈ శిక్షణ ఇస్తున్నామని వారు పేర్కొన్నారు. యువతీ, యువకులకు ప్రత్యేకంగా శిక్షణ బ్యాచ్‌లు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు బాగ్అంబర్పేటలోని శ్రీషిర్డీ సాయిబాబా సంస్థాన్‌లో గానీ ఫోన్ నెంబర్ 040-27424824, సెల్ః8374334546లో సంప్రదించాలని కోరారు.